
జనరల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆగస్టు 2026 ప్రత్యేక సంచికలో ఫార్చ్యూన్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై చోటు దక్కించుకున్నారు. “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్: హౌ నారా లోకేష్ ఈజ్ పవర్డ్ ది స్టేట్స్ నెక్స్ట్ చాప్టర్” అనే శీర్షికతో ఆయనపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, పురోగతిలో లోకేష్ పాత్రను ఈ కథనం ప్రస్తావించింది.

ఫార్చ్యూన్ ఇండియా తన “40 అండర్ 40” విభాగంలో లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఎదుగుతున్న కీలక నాయకుడిగా అభివర్ణించింది. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి రంగాల్లో ఆయన ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం ప్రచురించడం ఆసక్తికరంగా మారింది. ఫార్చ్యూన్ ఇండియా కవర్‌పై ఆయన ఫొటో రావడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!