

తెలుగులో పెద్దగా అవకాశాలు రాక కెరీర్లో వెనుకబడిన “బుట్ట బొమ్మ” పూజా హెగ్డే కోలీవుడ్‌లో వరుస అవకాశాలు పొందుతూ ముందుకు వెళ్లుతున్నారని ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం ఆమె దళపతి విజయ్‌తో జన నాయకన్ చిత్రంలో నటిస్తోంది. అలాగే రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4లో కూడా ఆమెకు అవకాశం దక్కిందని సమాచారం. ఇటీవలి వార్తల ప్రకారం, ధనుష్ తదుపరి చిత్రానికి కూడా పూజా హెగ్డేను హీరోయిన్గా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందనుంది.
అయితే చివరి దశలో నిర్ణయం మారి, పూజా హెగ్డే స్థానంలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పూజా హెగ్డే విషయంలో ఇలాంటి “చివరి నిమిషం మార్పులు” తరచూ జరుగుతుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ధనుష్–సాయి పల్లవి కాంబినేషన్‌కు ఇప్పటికే మారి 2 ద్వారా మంచి క్రేజ్ ఉంది. ఆ చిత్రంలోని “రౌడీ బేబీ” సాంగ్ సెన్సేషన్ అయ్యింది.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్లో నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళంలో ఇటీవలి కాలంలో ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. తండేల్ తర్వాత ఆమె ఏ చిత్రం కోసం చర్చలో కూడా లేరు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న బాలీవుడ్ రామాయణం కోసం ఆమె పూర్తిగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం.
అయితే ధనుష్ 55 వ చిత్రం కోసం మాత్రం సాయి పల్లవి సైన్ చేసినట్లు తెలుస్తోంది. అమరన్ చిత్రంతో రాజ్‌కుమార్ పెరియసామితో ఆమెకు ఉన్న మంచి అనుభవం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నట్లు టాక్. పూజా హెగ్డేను ముందుగా పరిశీలించినా, సాయి పల్లవి అందుబాటులో ఉండడంతో ఆమెను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.
ఇలా చూస్తే పూజా హెగ్డేకు కోలీవుడ్‌లో కూడా బ్యాడ్ లక్ కొనసాగుతోందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ధనుష్–రాజ్‌కుమార్ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ సాయి పల్లవి తన పాత్రలో అద్భుతం చేస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. పాత్రల ఎంపికలో సాయి పల్లవి ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తండేల్ తర్వాత తెలుగులో కొత్త సినిమాకు ఆమె ఇంకా సైన్ చేయలేదు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!