
గాసిప్స్

అఖండ 2 టికెట్ రేట్ల అంశంలో డివిజన్ బెంచ్ నుంచి నిర్మాతలకు తాత్కాలిక ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపును అనుమతించిన ప్రభుత్వ జీవోను రద్దు చేసిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ఆ జీవో మరోసారి అమల్లోకి వచ్చినట్టైంది,అంటే పెరిగిన రేట్లు తాత్కాలికంగా అమల్లో కొనసాగే అవకాశం లభించింది.
అయితే టికెట్ రేట్లపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ మధ్యలో, నిర్మాతలు, బుక్ మైషో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు హైకోర్టు విచారణను కొనసాగిస్తోంది. కోర్టు ఆదేశాల అమలు, ఆన్లైన్ విక్రయాలు, సవరించిన రేట్లపై స్పష్టత కోసం వచ్చే రోజుల్లో కోర్టు మరిన్ని విచారణలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!