
సినిమాలు

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా, తెలంగాణ బోనాల పండుగ వేళ ‘ఎల్లమ్మ’ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. పసుపు, కుంకుమతో రూపొందించిన ‘ఎల్లమ్మ’ టైటిల్ పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ పాత్రలో కనిపించారు. గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించే ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌తో అంచనాలు పెంచుకున్న ఈ సినిమా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!