

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, ఎన్నో హిట్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడి, ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ స్వయంగా చేశారు. ముఖ్యంగా అండర్ వాటర్‌లో చేసిన భారీ అడ్వెంచర్ సీక్వెన్స్ ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గొండ్ తెగ సంస్కృతి నేపథ్యంతో సాగుతూ, అందులో రష్మిక ఒక శక్తివంతమైన గిరిజన మహిళా యోధురాలిగా కనిపించనున్నారు.
తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో సాధారణంగా అందరూ అనుసరించే మార్గాన్ని తాను ఎప్పుడూ ఎంచుకోలేదని, తన అంతరాత్మ చెప్పిన దారినే అనుసరించానని తెలిపారు. అదే తన విజయానికి ప్రధాన కారణమని చెప్పారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఇతరులను అనుకరించకుండా, తనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడించారు. అభిమానులకు స్పూర్తినిస్తూ, ఎవరినీ అనుకరించకుండా తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, నిజాయితీగా ఉండడమే నిజమైన విజయమని సూచించారు. వ్యక్తిత్వమే మనకు అతిపెద్ద బలమని ఆమె స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!