
జనరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కొత్త చిత్రం ‘మైసా’ కోసం చేసిన సాహసాలతో వార్తల్లో నిలుస్తోంది. కేరళలోని అతిరపల్లి జలపాతం వద్ద 80 అడుగుల ఎత్తు నుంచి డూప్ లేకుండా జంప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. షూటింగ్ సమయంలో చిన్న గాయాలు అయినప్పటికీ ఆమె పని ఆపకుండా కొనసాగించింది.
ఈ పాత్ర కోసం రష్మిక బ్యాంకాక్‌లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుల వద్ద కఠిన శిక్షణ తీసుకుంది. మార్షల్ ఆర్ట్స్, గిరిజన పోరాట విధానాలను రోజుకు ఎనిమిది గంటలపాటు సాధన చేసింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా నిలుస్తుందని భావిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!