

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రామాయణ రెండు భాగాల ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో భాగం చిత్రీకరణపై రణబీర్ కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైందని, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారమే పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. రెండు భాగాలను నిర్ణయించిన సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. రెండో భాగం చిత్రీకరణ సగానికి చేరుకుందని రణబీర్ వెల్లడించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!