

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారైనట్లు చిత్ర నిర్మాణ వర్గాల సమాచారం. సినిమా మొత్తం నిడివి 170 నిమిషాలు, అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలుగా ఉండనుంది. 1870ల నాటి మద్రాస్ కరువు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేసిన తిరుగుబాటు నేపథ్యంలో ఈ చారిత్రక కథను తెరకెక్కిస్తున్నారు. పాత్రల పరిచయం, భావోద్వేగాలు, భారీ యాక్షన్ సన్నివేశాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కథనంపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న జయమ్మగా కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కీలకంగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 16న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!