

ప్రపంచవ్యాప్తంగా రామాయణ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన 7 రోజుల్లోనే ఈ చిత్రం 934.55 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం భారతదేశంలో 511.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా, మొత్తం గ్రాస్ 611.05 కోట్లుగా నమోదైంది. ఇక విదేశీ మార్కెట్లలోనూ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ నుంచి ఇప్పటివరకు 323.50 కోట్ల గ్రాస్ వసూలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు 934.55 కోట్లకు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమా మరో కీలక మైలురాయికి అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకో 65.45 కోట్లు వసూలు చేస్తే చాలు.. 1,000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుంది. దీంతో ఈ మార్కును ఎప్పుడు అందుకుంటుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈరోజు వసూళ్లతో కలిపి కచ్చితంగా ఈ సినిమా వసూళ్లు 1000 కోట్లు దాటుతాయి. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఎంత వరకు చేరుతాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!