

ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో అక్కినేని నాగార్జున సినిమాల నిర్మాణ విధానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో చర్చకు దారితీశాయి. గతంలో సినిమా విడుదలకు నెల రోజుల ముందే మొదటి కాపీ సిద్ధంగా ఉండేదని ఆయన గుర్తుచేశారు. షూటింగ్‌ను ఎక్కువకాలం కొనసాగిస్తూ చివర్లో చిత్రీకరణ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్‌కు తక్కువ సమయం కేటాయించడం వల్ల తుది ఫలితంపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలా సినిమాల చిత్రీకరణ ఏళ్ల తరబడి సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
విడుదలకు కొద్దివారాల ముందు కూడా డబ్బింగ్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావుడిగా చేయాల్సి వస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. పర్ఫెక్షన్, రీషూట్ల పేరుతో షూటింగ్ ఆలస్యం చేస్తే చివర్లో సాంకేతిక విభాగాలపై ఒత్తిడి పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. నాగార్జున సూచించిన విధంగా చిత్రీకరణలోనే ప్రణాళిక పాటించి, పూర్తైన భాగాలను ముందుగానే పోస్ట్ ప్రొడక్షన్ బృందానికి అందిస్తే మెరుగైన ఫలితం సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సినిమా నాణ్యత కోసం నిర్మాణ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!