

రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న తలైవర్ 173పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా అధికారిక టైటిల్ ఖరారు చేయలేదు. అయినప్పటికీ, ప్రకటించిన నాటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఆయన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్‌ను చిత్రబృందం ఇటీవల నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రముఖి సినిమాలో సైకియాట్రిస్ట్ పాత్రలో నటించిన రజనీకాంత్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ డాక్టర్ పాత్రలో కనిపించకపోవడంతో, ఇప్పుడు అలాంటి పాత్రలో నటించనున్నారనే వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!