
జనరల్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై నగరం వచ్చే 10 ఏళ్లలో స్లమ్ రహితంగా మారే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. నగరవ్యాప్తంగా క్లస్టర్ విధానంలో పునరాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దట్టమైన నివాస ప్రాంతాలను అభివృద్ధి చేసి, అర్హులైన వారికి మెరుగైన గృహ వసతులు కల్పించడంపై దృష్టి పెట్టనుంది.
ఈ మార్పులో ధారావి పునరాభివృద్ధి కీలకంగా ఉండనుంది. తొలి దశలో 2029 ప్రారంభం నాటికి 10 వేల పునరావాస ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అర్హులైన నివాసితులకు మెరుగైన గృహ వసతులు కల్పించడంతో పాటు ముంబై నగర సమగ్ర పునరాభివృద్ధికి ఈ ప్రణాళిక దోహదపడనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!