

‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. యంగ్ బ్యూటీ నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా టీజర్ లాంచ్‌కు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించారు.
‘తెల్ల కాగితం’ టీజర్‌ను రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ల్యాబ్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి, దర్శకులు బాబీ, రామ్ అబ్బరాజు, భాను భోగవరపు హాజరుకానున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!