

తెలంగాణలో థియేటర్ల రెవెన్యూ షేరింగ్ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న వివాదంపై త్వరలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ, పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచే పోరాటం చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది కూడా ఈ అంశాన్ని లేవనెత్తామని, అయితే హరిహరవీరమల్లు విడుదల సమయంలో చర్చించవద్దని సూచించారని చెప్పారు. రెండు నెలల్లో సమస్యపై చర్చిస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చామని వెల్లడించారు.
సీనియర్ నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ, శుక్రవారం జరిగే ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒకే కుటుంబమని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే పెద్ది సినిమాను వివాదంలోకి లాగడం సరికాదని శ్రీధర్ వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!