
జనరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా కనిపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
షూటింగ్ విరామ సమయంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ కలిసి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సినిమా వీక్షించారు. వీరి ఫొటోను థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకోగా అది వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' పాత్రలో, ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!