

ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘సుయోధన’ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి మరియు ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరియు సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించగా, బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, మంచి కథా కధనాలతో అత్యుత్తమ ప్రమాణాలతో ‘సుయోధన’ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. చిత్రంలో నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పారు. ఈ సినిమాకు జై క్రిష్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. త్వరలో టీజర్, ట్రైలర్ మరియు పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!