
జనరల్

‘హను-మాన్’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ‘మహాకాళి’ చిత్రంతో మరో భారీ ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. భారతీయ పురాణాలు, ఆధ్యాత్మికత, ఫాంటసీ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రోహిత్ సరాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించేలా డిజైన్ చేస్తున్నారట. ‘మహాకాళి’కి సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి హైప్‌ను సొంతం చేసుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!