

డార్లింగ్ ప్రభాస్ కోకాపేట్‌లో తన డ్రీమ్ లగ్జరీ మ్యాన్షన్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని కోకాపేట్‌లో రెండేళ్ల క్రితం రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేసిన ఆయన, తాజాగా మున్సిపల్ అధికారుల నుంచి అన్ని అనుమతులు పొందిన తరువాత నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్థలం ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌కు సమీపంలో ఉండటం వల్ల శంషాబాద్ విమానాశ్రయం, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి కీలక ప్రాంతాలకు సులభంగా చేరుకునే సౌకర్యం ఉంది.
ప్రస్తుతం కోకాపేట్‌లో ఎకరం ధర సుమారు రూ.80 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం, దీంతో ప్రభాస్ స్థలం విలువ దాదాపు రూ.160 కోట్లుగా అంచనా వేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ డ్రీమ్ హౌస్‌లో హై ఎండ్ ఫిట్‌నెస్ సెంటర్, ప్రైవేట్ థియేటర్, ఆధునిక సౌండ్ సిస్టమ్, స్విమ్మింగ్ పూల్ వంటి అతి విలాసవంతమైన సదుపాయాలు ఉండనున్నాయి. ఈ భారీ మ్యాన్షన్ నిర్మాణం పూర్తవడానికి మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!