

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న ఫౌజీ సినిమా ముగింపు దశకు చేరుకోగా, స్పిరిట్, కల్కి 2 చిత్రాలు ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత చేయాల్సిన ప్రాజెక్టుల్లో సలార్ 2తో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేయనున్న చిత్రం కూడా ఉంది. ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం వినిపించిన నేపథ్యంలో, చిత్ర యూనిట్‌కు చెందిన సన్నిహిత వర్గాలు స్పందించి అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమవుతుందని, సరైన సమయంలో అధికారిక ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. గతంలోనే ప్రభాస్ టెస్ట్ లుక్ పూర్తి చేసినట్లు వార్తలు రావడంతో, సినిమా ప్రకటించిన వెంటనే ఫస్ట్ లుక్‌తో పాటు పూర్తి వివరాలు విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రిషబ్ శెట్టితో జై హనుమాన్ సినిమాను ప్రారంభించే పనుల్లో ఉన్నారు. ప్రభాస్ కమిట్మెంట్లు పూర్తయ్యేలోపు ఆ చిత్రాన్ని ముగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.









.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!