

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ మూవీ ‘ఫౌజీ’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరోవైపు బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈఠ’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టు 14న విడుదల చేయాలని భావించినప్పటికీ, యష్ ‘టాక్సిక్’తో క్లాష్‌ను నివారించేందుకు వాయిదా వేశారు. ఇప్పుడు డిసెంబర్ 4న ‘ఈఠ’ విడుదల కానుంది. దీంతో డిసెంబర్ 3న ‘ఫౌజీ’, డిసెంబర్ 4న ‘ఈఠ’ వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఆసక్తికరంగా గతంలో ‘సాహో’లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి నటించగా, వారి జోడీకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు ఒకరోజు తేడాతో విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వార్‌పై ఆసక్తి పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!