

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, ఇతర పార్టీ నాయకులు, అభిమానులు కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో సినిమాను చూశారు.
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని కీలక పాత్రలో నటించారు. సికింద్రాబాద్ నేపథ్యంలో కథ సాగుతుందని చిత్ర వివరాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!