

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడితో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం ఆమెకు వెండితెరపై తొలి సినిమా కావడంతో పాటు, తెలుగు సినీ పరిశ్రమలోనూ అరంగేట్రం కానుంది. ఇమాన్వి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు సంబంధించిన అందమైన పోస్టర్‌ను విడుదల చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
ఇదే నెల అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో అభిమానుల కోసం ప్రత్యేక ట్రీట్ అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘ఫౌజీ’ నుంచి రాబోయే అప్‌డేట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారో తెలుసుకోవడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!