

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 18న విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ చూసి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ట్రైలర్లో భారీ ఎమోషన్స్, పవర్ఫుల్ మోమెంట్స్ ఉంటాయని చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇదే సమయంలో మే 19న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ టీజర్ కూడా విడుదల కానుంది. ట్రైలర్ స్థాయి నిడివితో ఈ టీజర్ ఉండబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా రెండు భారీ అప్డేట్లు రావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పోలికలు, ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. ఈ వారం టాలీవుడ్లో అత్యంత హాట్ టాపిక్‌గా ‘పెద్ది’ మరియు ‘డ్రాగన్’ మారిపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!