

అర్జెంటీనాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ హోసామ్ హసన్ చేసిన ‘X’ సిగ్నల్ తీవ్ర చర్చకు దారితీసింది. ఎంజో ఫెర్నాండెజ్ చివరి నిమిషంలో విజేత గోల్ సాధించిన వెంటనే హసన్ టచ్‌లైన్ వద్దకు వచ్చి రిఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్ వైపు చూస్తూ ‘X’ గుర్తును చూపించారు. దీనిపై రిఫరీ వెంటనే ఆయనకు ఎల్లో కార్డ్ చూపించారు. ఫిఫా నిబంధనల ప్రకారం ఈ గుర్తు సాధారణంగా జాత్యహంకార ఘటనలను నివేదించేందుకు ఉపయోగిస్తారు.
అయితే మ్యాచ్ అనంతరం హసన్ జాత్యహంకారంపై కాకుండా రిఫరీ నిర్ణయాలపై నిరసన వ్యక్తం చేయడానికే ఈ సంకేతాన్ని ఉపయోగించినట్లు వెల్లడైంది. మహ్మద్ సలాపై ఫౌల్ ఇవ్వకపోవడం, VAR ద్వారా ఈజిప్ట్ గోల్‌ను రద్దు చేయడం, మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2-0తో వెనుకబడ్డ అర్జెంటీనా, లియోనెల్ మెస్సి నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుని 3-2తో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!