

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ పొందినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, శ్రీలీల కలిసి నడుస్తున్న పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు. మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించినా, ఇతర చిత్రాల షెడ్యూల్ మార్పులతో ఒక వారం ముందుకు తీసుకొచ్చారు. వరుస సెలవుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ధురంధర్ 2 నుంచి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక ట్రైలర్ విడుదల, ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరియు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోలుకు అనుమతి వచ్చే అవకాశం ఉండగా, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!