

తెలుగు చిత్ర పరిశ్రమ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28 న జరగనున్న నేపథ్యంలో మా బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –
చిత్ర పరిశ్రమలోని నాలుగు విభాగాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లుగా గిల్డ్ వ్యవహార శైలి వల్ల పరిశ్రమ అదుపు తప్పిందని, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా స్వార్థంగా వ్యవహరించారని విమర్శించారు. ఛాంబర్ పరిష్కరించాల్సిన సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించారని చెప్పారు. చిన్న నిర్మాతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, క్యూబ్, యూఎఫ్ఓ ల వల్ల ఇబ్బందులు పెరిగాయని అన్నారు. తాము పోటీ చేస్తున్న ప్యానెల్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ –
గిల్డ్ సభ్యులు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదని, ఓటీటీ, టికెట్ రేట్ల విషయాల్లోనూ గిల్డ్ తప్పుడు హామీలు ఇచ్చిందన్నారు. ఛాంబర్ బిల్డింగ్ అంశంపై గిల్డ్ నేతల వ్యాఖ్యలను ఖండించారు. చిన్న నిర్మాతలు తమ ప్యానెల్ వైపే ఉన్నారని, తమ ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు.
రవిచంద్ యలమంచిలి మాట్లాడుతూ –
గిల్డ్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని, పెద్ద నిర్మాతలు స్వార్థంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చిన్న నిర్మాతలు తమ ప్యానెల్‌ను గెలిపించాలని కోరారు.
నట్టికుమార్ మాట్లాడుతూ –
గిల్డ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదని, కొందరు స్వార్థంగా గిల్డ్ నిధులను వాడారని ఆరోపించారు. తమ ప్యానెల్ మెడిక్లెయిమ్ సౌకర్యం, చిన్న సినిమాలకు ఐదో షో కోసం కృషి చేస్తుందని తెలిపారు.
తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ –
కరోనా సమయంలో చదలవాడ ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. గిల్డ్ నేతలు తమ స్వార్థం కోసమే పదవులు వాడుకున్నారని ఆరోపించారు. గిల్డ్ నిధులతో మెడిక్లెయిమ్ హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. పరిశ్రమకు ఉపయోగపడేలా ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు.

.jpeg)
.jpeg)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!