
సినిమాలు

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ప్రత్యేక ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, రిషబ్ శెట్టి, హరీశ్ శంకర్‌లతో కలిసి నవీన్ కనిపించారు. ఈ అరుదైన ఫ్రేమ్ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ఫొటోను పంచుకున్న నవీన్ పొలిశెట్టి సరదాగా “నా జీవితంలోనే అత్యంత ఖరీదైన ఫ్రేమ్.. దీని విలువ రూ.5,500 కోట్లు” అంటూ కామెంట్ చేశారు. ఇందులో ఉన్న దర్శకుల సినిమాల బాక్సాఫీస్ విజయాలను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే వచ్చే ఏడాది కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని కూడా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!