

మాస్ మహారాజా రవితేజ వరుస పరాజయాల తర్వాత తన సినిమాల వ్యాపార విధానంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రీకరణ పూర్తిచేసుకుని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రవితేజ తక్కువ పారితోషికం తీసుకుని, లాభాల్లో వాటా తీసుకునే విధానంలో పనిచేశారు. ఇదే నిర్మాణ సంస్థలో దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా చేయడానికి కూడా ఆయన అంగీకరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా కీలక మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం.
అనుకోని కారణాలతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజుతో భాగస్వామ్యం నుంచి ఇటీవలే విడిపోయిన లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రవితేజ త్వరలో హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న మరో సినిమాను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 నాటికి విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!