
న్యూస్

నటి రేణు దేశాయ్ తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకర కామెంట్లపై సీరియస్గా స్పందించారు. కొంతమంది నెటిజన్లు వ్యక్తిగతంగా దూషిస్తూ హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు తనను బాధించాయని ఆమె చెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో కలిసి ఆమె సైబర్ క్రైమ్ పోలీస్ వద్ద ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కామెంట్ల స్క్రీన్షాట్లు, లింకులు వంటి వివరాలను కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు త్వరలో విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!