పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలిసి రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్దమైంది. ప్రారంభంలో ప్రకటించిన తేదీ కంటే వారం ముందే, ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడనుంది. ఈ నేపథ్యంలో దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి మరియు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
నైజాం (తెలంగాణ) ప్రాంతంలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే, మేకర్స్ టికెట్ ధరలను పెంచకుండా సాధారణ రేట్లలోనే సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.300గా టికెట్లు లభిస్తాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19న తెల్లవారుజామున బెనిఫిట్ షోలు కోసం ప్రభుత్వం రూ.500 టికెట్ ధర అనుమతించింది.
విదేశాల్లోనూ ‘ఉస్తాద్’పై మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.2.31 కోట్లకు పైగా వసూలు అయింది. దాదాపు రూ.127 కోట్లు ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ సాధించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, ఈ నెల 18న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో ప్రారంభమవుతుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!