

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా గురించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో కనిపించనున్నారు. సాధారణ గ్లామర్ పాత్రకు భిన్నంగా, కథను మలుపుతిప్పే బలమైన పాత్రలో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఆమె కోసం ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి ‘ది మెసెంజర్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్. సల్మాన్ ఖాన్, నయనతార మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విలన్ పాత్ర కోసం అక్షయ్ ఖన్నా, ఫహద్ ఫాజిల్ పేర్లు వినిపిస్తున్నాయి. 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాతృభూమి’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!