
జనరల్

పద్మశ్రీ అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీ చేరుకున్న ప్రముఖ సినీనటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఘనంగా సత్కరించారు. తెలుగు సినీ పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన ఈ ఇద్దరు సీనియర్ నటులను అభినందిస్తూ వారి కృషిని కొనియాడారు.
తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని నారా లోకేష్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ఇద్దరు నటులకు లభించిన ఈ గౌరవం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టను మరింత పెంచిందని నాయకులు అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!