
జనరల్

దీపావళి పండుగకు ముందే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు శుభవార్త అందించింది. వీరికి కరువుభత్యం (డీఏ) 2.543 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 19.272 శాతంగా ఉన్న డీఏ 21.815 శాతానికి చేరింది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న మొత్తం 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపు అమలుకు రూ.14.63 కోట్ల అదనపు వ్యయం కానుంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలు, సంక్షేమాన్ని పరిరక్షించడంలో భాగంగానే ఈ పెంపునకు ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!