
జనరల్

వాయువ్య ఢిల్లీలోని మంగోల్పురి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న షూ తయారీ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
సహాయక చర్యల్లో భాగంగా ఫ్యాక్టరీ లోపల అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని సిబ్బంది గుర్తించారు. వారిని వెంటనే సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అగ్నిమాపక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!