
గాసిప్స్

2027 జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ప్రకటించింది. ఈసారి జనాభా వివరాల సేకరణలో డిజిటల్ విధానానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
2027 జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలు స్వీయ నమోదు (Self-Enumeration) ద్వారా తమ వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించుకోవచ్చు. జనగణన కోసం మార్చి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహించనున్నారు. డిజిటల్ విధానం ద్వారా ప్రజలకు వివరాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!