

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’లో ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ భాగస్వామిగా చేరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, ఆయన సాధించిన విజయాలు, స్వరాజ్యం కోసం సాగించిన పోరాటాన్ని సమగ్రంగా చూపించేందుకు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమాలో భూమి పెడ్నేకర్, అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టీ-సిరీస్ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం మరింత విస్తృత స్థాయిలో సాగనుంది.
‘కాంతార’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఈ చిత్రంలో నటించనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు, వారసత్వానికి తగిన ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల బృందంతో సినిమాను రూపొందించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2027 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. రెండు భాగాల విడుదల తేదీలు, ఇతర నిర్మాణ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!