

శరణ్య–సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి నిర్మిస్తున్న ‘మన డాక్టర్ బాబే’ సినిమా టీజర్ శనివారం విడుదలైంది. వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రబృందం సినిమాపై విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సినిమాతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు.
ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ టీజర్ వినోదభరితంగా ఉందని, ఇలాంటి కామెడీ సినిమాలు రావాలని అన్నారు. నటుడు అలీ సహా పలువురు సినీ ప్రముఖులు టీంకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విజయవంతం కావాలని, ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని వారు కోరారు. దర్శకుడు చలపతి కుమార్ ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపారు.
హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. టీజర్ చూసి ఇది యూత్ సినిమా మాత్రమే కాదని, అన్ని వయసుల వారికి నచ్చే ఫ్యామిలీ మూవీ అని పేర్కొన్నారు. మ్యూజిక్, డైలాగ్స్, కథ అన్నీ బలంగా ఉన్నాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!