

మౌనీరాయ్ తన భర్త సూరజ్ నంబియార్ తో విడిపోతున్నారనే ప్రచారాలపై స్పందించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆమె కోరారు. మౌనీరాయ్, సూరజ్ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్టు వార్తలు రావడంతో విడాకుల రూమర్లు మొదలయ్యాయి. అలాగే మౌనీరాయ్ కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలు షేర్ చేయకపోవడం, సూరజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుబాటులో లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
అయితే ఈ రూమర్లపై మౌనీరాయ్ క్లారిటీ ఇస్తూ, తప్పుడు వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరారు. 2022 జనవరిలో మౌనీరాయ్-సూరజ్ నంబియార్ వివాహం జరిగింది. నాగిని సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీరాయ్, గోల్డ్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించారు. అలాగే కేజీయఫ్ చాప్టర్ 1, Vedaa వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!