
ఆరోగ్యం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో పవర్ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘భారత్ భాగ్య విధాత’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో కంగనా మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న దృశ్యం కనిపిస్తూ ధైర్యం, త్యాగం, మానవత్వం, ఐక్యత వంటి భావాలను ప్రతిబింబిస్తోంది.
ఈ చిత్రానికి మనోజ్ తపాడియా రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధానంగా 26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో, ముఖ్యంగా కామా అండ్ అల్బ్లెస్ ఆసుపత్రిలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పిఇఎన్ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం 2026 జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!