

చిరంజీవి కథానాయకుడిగా, బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త ప్రచారాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం, మెగా కుటుంబానికి చెందిన హీరో సాయి దుర్గ తేజ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కీలక పాత్ర కోసం ఆయనను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రంలో చిరంజీవి పాత్రను పలు కోణాల్లో చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతాన్ని ప్రతిబింబించే సన్నివేశాల కోసం ప్రత్యేక లుక్‌ను సిద్ధం చేస్తున్నారట. కుటుంబ భావోద్వేగాలు, అనుబంధాలు, మాస్ అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!