

మెగా డాటర్ సుస్మిత కొణిదెల నిర్మించిన కొత్త వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ ట్రైలర్ విడుదలైంది. ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం, కుటుంబ వారసత్వం, ప్రేమ, స్వీయ అన్వేషణ వంటి అంశాల సమ్మేళనంగా ఈ కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
సిరీస్‌లో ప్రకాశ్ రాజ్ ప్రముఖ సంగీత విద్వాంసుడు శాస్త్రి పాత్రలో కనిపించనున్నారు. వైకుంఠపురం అనే దేవాలయ పట్టణం నేపథ్యంలో కథ సాగుతుంది. శాస్త్రి మనవడు బాలు తన తాత సంగీత వారసత్వాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూనే, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకునేందుకు చేసే ప్రయాణమే కథలో ప్రధానాంశం. కుటుంబ సంబంధాల్లోని ప్రేమ, మౌనం, అపార్థాలు, త్యాగాలను కూడా సిరీస్‌లో సున్నితంగా చూపించినట్లు తెలుస్తోంది.
హిందీలో విజయవంతమైన ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ను రూపొందించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. మధుబాల, శ్రీకాంత్, సుస్మిత శెట్టి, సుమన్, షఫీ, ఝాన్సీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!