

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మండాడి’. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసింది. విడుదలైనప్పటి నుంచి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది.
తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ‘మండాడి’కి ఆదరణ లభిస్తోందని మేకర్స్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు. సినిమాలోని బోట్ సీక్వెన్స్‌లు, రేసింగ్ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చిత్రబృందం పేర్కొంది. కథిర్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సూరి, సుహాస్ నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!