

‘రా కింగ్’ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ టీజర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యంతో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
1897–1920 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ టీజర్లో హై క్వాలిటీ విజువల్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే డేవిడ్ రెడ్డి పాత్రలో మంచు మనోజ్ శక్తివంతమైన నటన కనబరిచారు. అమాయకుల్ని కాపాడే అతని ప్రయాణం, బ్రిటీష్ అధికారులతో జరిగే సంఘర్షణ, ప్రేమ కథ అంశాలు టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!