

రవితేజ కథానాయకుడిగా నటించిన 'ఇరుముడి' చిత్రంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్ర విజయం కేవలం చిత్ర బృందానికే కాకుండా, యావత్ టాలీవుడ్ పరిశ్రమకు నూతనోత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం జరిగిన 'కూర్మ అవతార్' చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, "ఒక మంచి సినిమా ఎంతటి శక్తిని ఇస్తుందో 'ఇరుముడి' నిరూపించింది. ఈ చిత్రం సాధించిన విజయం పరిశ్రమలోని మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ప్రేక్షకులు ఇదే రీతిలో పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తే, మాలాంటి నిర్మాతలకు ఎంతో ధైర్యంగా ఉంటుంది" అని వివరించారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఇరుముడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, రూ. 200 కోట్ల క్లబ్ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో కలిపి ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం 1.25 లక్షల టికెట్ల విక్రయాలతో 1.5 మిలియన్ డాలర్లు వసూళ్లను సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!