

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కథ, విజువల్స్, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను ప్రత్యేకంగా ప్రజెంట్ చేసేందుకు దర్శకుడు ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని తీసుకొస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే వారణాసి కోసం మేకర్స్ మరో ఆసక్తికరమైన ప్రయోగం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం ప్రత్యేకంగా కొత్త భాషతో పాటు కొత్త లిపిని కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. బాహుబలి కోసం రాజమౌళి టీమ్ ప్రత్యేకంగా కిలికి అనే భాషను రూపొందించిన విషయం తెలిసిందే. అదే తరహాలో వారణాసిలోనూ కొత్త భాషను ఉపయోగించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నప్పటికీ, నిజమైతే అడ్వెంచర్ మూవీ లవర్స్‌కు ఈ సినిమా మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!