

సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన తదుపరి చిత్రం ‘వారణాసి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగా, ఆయన తాజాగా గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ షాట్‌గన్ గేమ్స్‌లో మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టారు. ఈ భాగస్వామ్యం ద్వారా పీసీ, కన్సోల్ ప్లాట్‌ఫామ్‌ల కోసం రూపొందిస్తున్న ‘టేక్‌డౌన్ జెనెసిస్’ అనే అడ్వెంచర్ గేమ్ అభివృద్ధికి మద్దతు లభించనుంది. ఈ గేమ్‌కు దర్శకుడు విక్కీ అరోరా నేతృత్వం వహిస్తున్నారు.
షాట్‌గన్ గేమ్స్ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విదిత్ మెహతా ఈ భాగస్వామ్యాన్ని ధృవీకరించారు. ఈ ప్రయాణంలో భాగస్వామి కావడం పట్ల మహేశ్ బాబు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు, తాజాగా విడుదలైన మహేశ్ బాబు లుక్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ చిత్రంపైనే దృష్టి సారించారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. మిగిలిన వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!