
రాజకీయాలు

సమంత ప్రధాన పాత్రలో, దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. సమంత–నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
మొదటి రోజు రూ.13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు దాదాపు రూ.15 కోట్ల గ్రాస్ సాధించి మరింత జోరు చూపించింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో మూడో రోజు మరింత భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సమంత స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!