
జనరల్

నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ చిత్ర ప్రారంభోత్సవ వేడుక అమరావతిలో ఘనంగా జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అమరావతిని సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు సినిమా రంగంతో పాటు క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాల ప్రారంభోత్సవాలు అమరావతిలో జరగాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!