
సినిమాలు

కోలీవుడ్ యువ నటి సంజనా కృష్ణమూర్తి తన కొత్త ప్రాజెక్టుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. విజయ్, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా మారింది.
తాను నటించిన పలు చిత్రాల వివరాలను ఆమె వెల్లడించింది. ఒక ప్రేమకథా చిత్రం త్వరలో అధికారికంగా ప్రకటించబడనుందని, అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘పరిమళ అండ్ కో’ జూన్ 5న విడుదల కానుందని తెలిపింది. విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ చిత్రంతో పాటు ఒక తెలుగు స్ట్రెయిట్ సినిమాతో కూడా తాను బిజీగా ఉన్నానని చెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!