
న్యూస్

కోలీవుడ్ హీరో మరియు నిర్మాత విశాల్‌కు మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు సంబంధించిన కేసులో విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. డబ్బులు చెల్లించేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరినా, సింగిల్ జడ్జి ఆ అభ్యర్థనను కొట్టివేశారు.
ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాల్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. అలాగే రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆరు వారాల గడువు కావాలని విశాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించకుండా పిటిషన్‌ను తిరస్కరించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!